Kamal Haasan: నా మిత్రుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు, ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయంపై ట్వీట్ చేసిన మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గురువారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గురువారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. "ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు.
పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించడం అభినందనీయం" అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. సినీ దిగ్గజం కమల్ హాసన్ తన సొంత పార్టీ అయిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రారంభించడానికి ముందు కలుసుకున్న అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో అరవింద్ కేజ్రీవాల్ ఒకరు కావడం గమనార్హం.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement