Viral Video: వీడియో ఇదిగో, జైలు నుంచి బయటకు వచ్చిన ఆనందంలో డ్యాన్స్ వేసిన ఖైదీ, జైలు సిబ్బంది ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా డ్యాన్స్

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ ఆనందంతో జైలు బయట డ్యాన్స్‌ చేశాడు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఒక కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి తరుఫున వాదించేందుకు న్యాయవాది లేరు.

Kannauj viral video (Photo Credit: X/@anand_journ)

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ ఆనందంతో జైలు బయట డ్యాన్స్‌ చేశాడు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఒక కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి తరుఫున వాదించేందుకు న్యాయవాది లేరు. అలాగే బెయిల్‌ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జరిమానా చెల్లించకపోవడంతో మరికొంత కాలం అదనంగా జైలులో ఉన్నాడు. పలు నెలలపాటు జైలు శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ గురించి లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలిసింది.

నిద్రలేకుండా చేస్తున్న నాగుపాము...కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తున్న పాము..ఎట్టకేలకు పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్‌..వీడియో

దీంతో ఆ వ్యక్తి బెయిల్‌ కోసం సహకరించింది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించకపోయినప్పటికీ బెయిల్‌పై బుధవారం అతడు విడుదలయ్యాడు.జైలు నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఆనందం పట్టలేకపోయాడు. అక్కడున్న పోలీసులు, జైలు సిబ్బందిని అతడు పట్టించుకోలేదు. ఆ జైలు బయట స్లో మోషన్‌లో డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Prisoner Breaks Into Dance As Cops Watch in UP

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement