Kannur Road Accident: కేరళ, బీహార్‌ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు, 11 మంది అక్కడికక్కడే మృతి, పలువురికి తీవ్ర గాయాలు

కేరళ, బీహార్‌ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు (Accident) చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 11 మంది దుర్మరణం పాలయ్యారు. బీహార్‌ (Bihar)లోని బగల్పూర్‌ (Bhagalpur)లో ఓ ట్రక్కు ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆమపూర్‌ గ్రామంలోని గోఘా పోలీసు స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారి 80పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Five People Killed in Collision Between Car and Lorry in Kerala’s Punnacherry

కేరళ, బీహార్‌ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు (Accident) చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 11 మంది దుర్మరణం పాలయ్యారు. బీహార్‌ (Bihar)లోని బగల్పూర్‌ (Bhagalpur)లో ఓ ట్రక్కు ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆమపూర్‌ గ్రామంలోని గోఘా పోలీసు స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారి 80పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్‌లోని ధాపరి నుంచి కహల్‌గావ్‌లోని శ్రీమత్‌పూర్‌లో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కొందరు ఎస్‌యూవీలో బయలుదేరారు. కారు గోఘా పోలీసు స్టేషన్‌ పరిధిలోకి రాగానే.. రాడ్‌ల లోడు లారీ టైర్‌ పేలడంతో కారుపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

కేరళ రాష్ట్రం కన్నూర్‌లో సోమవారం రాత్రి ఓ కారు, లారీ ఢీ కొన్నాయి. పున్నచ్చేరిలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement