Karnataka: కర్ణాటకలో చర్చిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, బేబీ జీసెస్ విగ్ర‌హాన్ని కూడా ధ్వంసం చేసిన దుండగులు, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

ఆ చ‌ర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్ర‌హాన్ని కూడా ధ్వంసం చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. క్రిస్మ‌స్ ముగిసిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే మైసూరులోని పెరియాప‌ట్నాలో ఉన్న‌ సెయింట్ మేరీస్ చ‌ర్చిని ధ్వంసం చేశారు

Karnataka church vandalised (Photo-ANI)

క‌ర్నాట‌క‌లోని మైసూరులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చ‌ర్చిని ధ్వంసం చేశారు. ఆ చ‌ర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్ర‌హాన్ని కూడా ధ్వంసం చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. క్రిస్మ‌స్ ముగిసిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే మైసూరులోని పెరియాప‌ట్నాలో ఉన్న‌ సెయింట్ మేరీస్ చ‌ర్చిని ధ్వంసం చేశారు.సీసీటీవీ కెమెరాల ద్వారా ప‌రారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వెనుక గేటును బ్రేక్ చేసి చ‌ర్చిలోకి దుండ‌గులు ప్ర‌వేశించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. చ‌ర్చిలో ఉన్న డ‌బ్బుల్ని దొంగ‌లించేందుకు దానిపై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. క‌లెక్ష‌న్ బాక్సును కూడా దుండ‌గులు ఎత్తుకెళ్లారని మైసూరు ఎస్పీ సీమా ల‌ట్కార్ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు