Karnataka: అతివేగం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూడండి, కరెంట్ పోల్‌ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిన యువకుడు, స్పాట్‌లోనే మృతి
మంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళ్తున్న నిషాంత్(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు.
మంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళ్తున్న నిషాంత్(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు.
ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే నిషాంత్ చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)