Karnataka: మహిళా రైతు పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, విలవిలలాడిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

జూలై 4వ తేదీ రాత్రి హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.

Farmer Alleges Tomatoes Stolen Her Farm

Farmer Alleges Tomatoes Stolen Her Farm: కర్ణాటక | జూలై 4వ తేదీ రాత్రి హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు. శనగ పంటలో భారీ నష్టాలు చవిచూసి టమోటాలు పండించడానికి అప్పులు చేశాం. మాకు మంచి పంట వచ్చింది. ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 50-60 బస్తాల టమోటాలను తీసుకెళ్లడమే కాకుండా, మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేశారని ధరణి చెప్పారు. హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

ANI News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement