HC On Rape and Maintenance Of Child: ఇష్టంతో శృంగారంలో పాల్గొన్న తరువాత గర్భం దాలిస్తే పురుషునిపై అత్యాచారం కేసు పెట్టలేరు, కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

కర్ణాటక హైకోర్టు ఇటీవల ఒక వ్యక్తిపై మోపిన అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది. అయితే అతను వివాహ వాగ్దానంపై ఆరోపించబడిన మహిళతో ఏకాభిప్రాయ సంబంధంతో జన్మించిన బిడ్డకు నెలవారీ రూ. 10,000 చెల్లించాలని ఆదేశించింది.

Karnataka High Court (Photo-PTI)

కర్ణాటక హైకోర్టు ఇటీవల ఒక వ్యక్తిపై మోపిన అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది. అయితే అతను వివాహ వాగ్దానంపై ఆరోపించబడిన మహిళతో ఏకాభిప్రాయ సంబంధంతో జన్మించిన బిడ్డకు నెలవారీ రూ. 10,000 చెల్లించాలని ఆదేశించింది.ఇద్దరి సమ్మతితో సెక్స్ లో పాల్గొన్నారని దాన్నిరేప్ గా పరిగణించలేమని కోర్టు తీర్పును వెలువరించింది. ఈ సమయంలో ఇద్దరికీ పుట్టిన బిడ్డకు నెలకు రూ. 10 వేలు భరణంగా చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరిచింది.

ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళకు ఇంతకు ముందే పెళ్ళి అయింది. అయితే వివాహ జీవితంలో ఒడిదుడుకులు రావడంతో ఆమె వేరొకరికి దగ్గర అయింది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత అతను పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహిళ కోర్టులో కేసు వేసింది. విచారణలో కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది.

Here's Live Law Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement