Karnataka Lockdown Update: రేపటి నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్, రాష్ట్రంలో 14 రోజులపాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించిన యడ్డ్యూరప్ప సర్కారు

మరికొన్ని రాష్ట్రాలు వారాంతపు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. తాజాగా, రేపటి నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

BS Yediyurappa | File Image | (Photo Credits: PTI)

నిన్న కర్ణాటకలో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి 14 రోజులపాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. మంత్రులు, నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యడియూరప్ప ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు మాత్రం ప్రజలను అనుమతిస్తామన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)