Karnataka Road Accident: ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన లారీ, ఏడుమంది మృతి, 26 మందికి గాయాలు, హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడు మంది దుర్మరణం పాలవగా.. 26 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా బైపాస్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. కొల్లాపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి.

Karnataka Road Accident. (Photo Credits: ANI)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడు మంది దుర్మరణం పాలవగా.. 26 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా బైపాస్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. కొల్లాపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనిర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుంబీలోని ఆసుప్రతికి క్షతగాత్రులను తరలించారు. 26 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను హుబ్లీ కమిషనర్‌ పరామర్శించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement