Karnataka Road Accident: దైవదర్శనం కోసం వెళుతూ అనంతలోకాలకు, బెళగావి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుమంది మృతి, 16 మందికి గాయాలు

గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Representational Image (Credits: Facebook)

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోదైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు చేరుకున్నారు యాత్రికులు. గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), ఇందిరవ్వ(24), మారుతి(42)గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హులంద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సౌందత్తి యల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నారు. బొలెరో గూడ్స్‌ వాహనంలో మొత్తం 23 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల మలుపు వద్ద వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో మర్రి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif