Karnataka Shocker: కర్ణాటకలో ముసుగు హత్య కలకలం, మాస్కులు ధరించి వ్యక్తిపై కత్తులతో విరుచుకుపడిన దుండుగులు, బాధితుడు చికిత్స పొందుతూ మృతి
కర్ణాటకలో ముసుగు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరులో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు.
కర్ణాటకలో ముసుగు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరులో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు.కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత నిందితులను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్. 144 సెక్షన్ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. కాగా మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.