Protests Against LPG Price Hike: వంట గ్యాస్ బాదుడుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు,మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు
మార్చి 1వ తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌ల ధర యూనిట్‌కు రూ. 350.50, డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధర యూనిట్‌కు రూ.50 చొప్పున పెరిగింది
వాణిజ్య LPG సిలిండర్లు, గృహ LPG సిలిండర్ల ధరల పెంపునకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కర్ణాటకలో నిరసన చేపట్టింది. మార్చి 1వ తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌ల ధర యూనిట్‌కు రూ. 350.50, డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధర యూనిట్‌కు రూ.50 చొప్పున పెరిగింది.నిన్నటి వరకు హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ. 1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ. 1,155కు చేరుకుంది.
ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,103కు పెరగ్గా వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,119.50కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 25 పెరిగింది. పెంపుకు నిరసనగా పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)