Katra Bus Accident: దైవదర్శనంకు వెళ్ళి తిరిగి వస్తున్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఇద్దరు భక్తులు మృతి, 22 మందికి గాయాలు, జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో విషాద ఘటన
పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఇద్దరు భక్తులు మృతి చెందగా, 22 మంది భక్తులు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ఇద్దరు భక్తులు మృతి చెందగా, 22 మంది భక్తులు గాయపడ్డారు. వారిని కత్రాలోని సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు. కత్రా నుంచి జమ్మూకు తిరిగి వస్తున్న సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)