Kerala Bandh Today: ఈ రోజు కేరళ బంద్, PFI కార్యకర్తల అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

NIA మరియు ED 19 మంది PFI కార్యకర్తలను అరెస్టు చేయడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శుక్రవారం 'కేరళ బంద్'కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం బలమైన ప్రాంతాలలో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు బంద్ యొక్క గరిష్ట ప్రభావం కనిపించింది.

PFI protestors (photo credit- IANS)

NIA మరియు ED 19 మంది PFI కార్యకర్తలను అరెస్టు చేయడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శుక్రవారం 'కేరళ బంద్'కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం బలమైన ప్రాంతాలలో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు బంద్ యొక్క గరిష్ట ప్రభావం కనిపించింది. పలు చోట్ల కార్యకర్తలు తమ దుకాణాల షట్టర్లను దించడంతో పాటుగా ప్రజల చేత బలవంతంగా మూయించి వేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) గురువారం తెల్లవారుజామున జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా వారి నాయకత్వంలోని ఉన్నతాధికారులతో సహా 19 మంది పిఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.కేరళ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేసి, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ, PFI కార్యకర్తలు అనేక చోట్ల విధ్వంసానికి దిగారు.రాళ్లు రువ్వారు. ప్రభుత్వ యాజమాన్యంలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన పలు బస్సులపై కొన్ని ప్రాంతాల్లో రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి.హింసాత్మక సంఘటనలలో ఆస్తి నష్టంతో పాటు, KSRTC సిబ్బందిలో కొంతమంది గాయపడినట్లు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement