Hindu wedding in Mosque: మసీదులో వేదమంత్రాలు నడుమ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి, వేదికైన చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు, వీడియో ఇదిగో..
కేరళ రాష్ట్రంలో మసీదులో జరిగిన ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు ఈ హిందూ జంట పెళ్లికి వేదికైంది.
కేరళ రాష్ట్రంలో మసీదులో జరిగిన ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు ఈ హిందూ జంట పెళ్లికి వేదికైంది. పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం పండితుల వేదమంత్రాలు, బాజాభజంత్రీల నడుమ వధువు అంజూ, వరుడు శరత్‌ల పెళ్లి జరిగింది.
నిర్వాహకులు తమ మసీదులో హిందూ జంటకు పెళ్లి చేయడమే కాదు, వధువుకు 10 తులాల బంగారం, దంపతులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం కూడా చేశారు. అంతేగాక వధూవరుల బంధుమిత్రులు 1000 మందికి భోజనాలు పెట్టించారు. దాంతో ఆ మసీదులో మతసామరస్యం వెళ్లివిరిసింది.2020లో జరిగిన ఈ పెళ్లి వీడియో గత కొన్ని వారాలుగా మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)