Kerala Horror: వీడియో ఇదిగో, గంట వ్యవధిలో కుటుంబంలో ఆరుమందిని చంపిన యువకుడు, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

కేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ

Crime | Representative Image (Photo Credit: Pixabay)

కేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల తర్వాత అఫన్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే.. అప్పటికే తను విషం తీసుకున్నట్లు అఫన్ పోలీసులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు ఐదు మరణాలను నిర్ధారించారు.

జగిత్యాలలో దారుణం, ఆస్తి కోసం సొంత అన్నను చంపిన ఇద్దరు చెల్లెళ్లు, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఇద్దరు మహిళలు

సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాలలో ఈ హత్యలు జరిగాయి. నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని వివరించిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది.నిందితుడి 13 ఏళ్ల సోదరుడు అహసన్, అమ్మమ్మ సల్మా బీవీ, మామ లతీఫ్, అత్త షాహిహా, అతని స్నేహితురాలు ఫర్షానా మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ హత్యల వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు మరియు సామూహిక హత్యపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించారు.

Man walks into police station, says he killed 6, including mother and girlfriend

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now