Kerala: షాకింగ్ సీసీటీవీ పుటేజీ... స్కూటర్ మీద వచ్చి సీపీఎం ఆఫీసుపై బాంబు విసిరిన అగంతకుడు, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కేరళ రాజధాని తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో స్కూటర్‌పై వచ్చిన ఓ వ్యక్తి పార్టీ ఆఫీస్‌పై బాంబు విసిరాడు. ఈ దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

On Camera, Man On Scooter Throws 'Bomb' At CPM Office

కేరళ రాజధాని తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో స్కూటర్‌పై వచ్చిన ఓ వ్యక్తి పార్టీ ఆఫీస్‌పై బాంబు విసిరాడు. ఈ దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకేజీ సెంటర్‌లో ఉంటున్న కొందరు పార్టీ నాయకులు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. దీంతో బయటకు వచ్చిన నాయకులు అది తమ పార్టీ ఆఫీసు కాంపౌండ్‌ గోడ వద్దే జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉన్నదని కమ్యూనిస్ట్‌ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement