Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన మరో బస్సు, 25 మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

కేరళ (Kerala)లోని త్రిసూర్‌ (Thrissur ) జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ (Irinjalakuda) సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది.

Road Accident (Representational Image)

కేరళ (Kerala)లోని త్రిసూర్‌ (Thrissur ) జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ (Irinjalakuda) సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం త్రిసూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇరింజలకుడ పోలీసు స్టేషన్‌ అధికారి తెలిపారు.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement