Kerala: గురుశిష్యుల బంధానికి మాయని మచ్చ, అంధుడైన అధ్యాపకుడు పాఠం చెబుతుంటే విద్యార్థులు వెకిలి చేష్టలు, వారిని సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం
వెకిలి చేష్టలతో హేళన చేశారు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీశారు.
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ కాలేజీలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకుడు అంధుడైన గురువు చుట్టూ చేరిన కొందరు కాలేజీ విద్యార్థులు ఆయనను ఆటపట్టించారు. వెకిలి చేష్టలతో హేళన చేశారు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీశారు.ఓ తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఓ ఆరుగురు విద్యార్థులు ఆయన చుట్టూ చేరి అల్లరి చేశారు. ఆయన దృష్టి లోపాన్ని దెప్పి పొడుస్తూ అవమానకరంగా మాట్లాడారు.
ఆ దృశ్యాలను వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్టు చేశారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. విద్యార్థుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో ఆ ఘటనకు బాధ్యులైన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై బాధిత అధ్యాపకుడు మాట్లాడుతూ.. ‘నేను ఒక గంట బోధన కోసం రెండు గంటలు సిద్ధమై తరగతి గదికి వస్తే విద్యార్థులు ఆ విధంగా ప్రవర్తించారు. ఆ వీడియో చూసి నా స్నేహితులు, బంధువులు బాధపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకుంటా’ అన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)