Ladakh Road Accident: జవాన్లను కాటేసిన మృత్యువు, లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు జవాన్లు మృతి, మరో 19 మంది సైనికులకు తీవ్ర గాయాలు
లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలో కోల్పోయారు. మరో 19 మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి.
లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో పడిపోయిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలో కోల్పోయారు. మరో 19 మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది. 26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)