Delhi Lockdown: లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, దేశ రాజధానిలో తగ్గుముఖం పడుతున్న కేసులు

దేశరాజధానిలో లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా మరణాలు పెరుగుతుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రోజు ఢిల్లీలో 6430 కేసులు నమోదయ్యాయి. 11591 మంది ఆరోగ్యం మెరుగుపడింది.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: IANS)

దేశరాజధానిలో లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా మరణాలు పెరుగుతుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రోజు ఢిల్లీలో 6430 కేసులు నమోదయ్యాయి. 11591 మంది ఆరోగ్యం మెరుగుపడింది. మార్చి చివరి వారం నుంచి ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. రోజూ 5000 మార్కును దాటుతుండటం ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది. మొదట్లో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేసిన కేజ్రీవాల్ సర్కార్... ఆ తర్వాత దాన్ని వారమంతా అమలు చేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల 19న లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. మొదట వారం రోజులని చెప్పినా.. దాన్ని మళ్లీ మళ్లీ పొడిగిస్తూనే ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now