Delhi Lockdown Extended: మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు, ఆ తర్వాత ఎత్తేస్తామని తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, దేశ రాజధానిలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కేవలం నెల రోజుల్లోనే 29 వేల నుంచి 2 వేల లోపుకు దిగొచ్చాయి. కేసులు పెరిగిపోతుండడంతో వెంటనే లాక్‌డౌన్ విధించిన ఢిల్లీ సీఎం.. ఫలితం రాబట్టారు. ఆదివారం ఆయన ఢిల్లీలో కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: Agencies)

ప్రస్తుతం మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని, అందరి ఏకాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో కొత్తగా కేవలం 1,600 కేసులే నమోదయ్యాయని ప్రకటించారు. పాజిటివిటీ రేటు 2.5 శాతం కన్నా తక్కువే నమోదైందన్నారు. కేసులు భారీగా తగ్గుతున్నాయని, ఇంకో వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తామని చెప్పారు.

కరోనాతో పోరు ఇంకా అయిపోలేదని కేజ్రీవాల్ చెప్పారు. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. త్వరలోనే 2 కోట్ల మందికి టీకాల కోసం చర్యలు చేపడతామన్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ వివరించారు.

Here's ANI Update