Lockdown in Tamil Nadu: లాక్‌డౌన్ మే 31 వ‌ర‌కూ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం, నిత్యావ‌సరాల‌ను త‌ర‌లించే వాహ‌నాల‌కు అనుమతి

క‌రోనావైరస్ క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్ ను మే 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శ‌నివారం వెల్ల‌డించింది. ప్ర‌స్తుత లాక్‌డౌన్ మే 24తో ముగియ‌నుండ‌గా క‌రోనా కేసుల నియంత్ర‌ణ‌కు మ‌రో వారం రోజుల పాటు పొడిగించింది.

MK Stalin (Photo Credits: File Image)

క‌రోనావైరస్ క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్ ను మే 31 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శ‌నివారం వెల్ల‌డించింది. ప్ర‌స్తుత లాక్‌డౌన్ మే 24తో ముగియ‌నుండ‌గా క‌రోనా కేసుల నియంత్ర‌ణ‌కు మ‌రో వారం రోజుల పాటు పొడిగించింది. కొవిడ్-19 రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలతో పాటు మెరుగైన వ‌స‌తుల‌ను క‌ల్పిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ వెల్ల‌డించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో భేటీ అనంత‌రం ఆయ‌న లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇక నిత్యావ‌సరాల‌ను త‌ర‌లించే వాహ‌నాల‌ను లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ అనుమ‌తిస్తారు. ఇక‌ వైద్య సంబంధ కార‌ణాల‌తో జిల్లాల మ‌ధ్య తిరిగే వాహ‌నాల‌కు ఈ-రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని అధికారులు తెలిపారు

Here's Lockdown in Tamil Nadu Updates

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement