Lok Sabha Elections 2024: మతం పేరుతో ఓట్లు అడిగాడంటూ బీజేపీ ఎంపీపై కేసు నమోదు, ఎక్స్ వేదికగా తెలిపిన బెంగుళూరు ఎన్నికల ప్రధాన అధికారి

బెంగుళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, అదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తేజస్వి సూర్యపై కేసు బుక్ చేసినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ X లో తెలిపారు. మతం ఆధారంగా ఓట్లు అభ్యర్థించిన వీడియోను పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు బుక్ చేశారు.

Tejasvi Surya

బెంగుళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, అదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తేజస్వి సూర్యపై కేసు బుక్ చేసినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ X లో తెలిపారు. మతం ఆధారంగా ఓట్లు అభ్యర్థించిన వీడియోను పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు బుక్ చేశారు. 'ఎక్స్' హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసి మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించినందుకు తేజస్వి సూర్య ఎంపీ ,బెంగళూరు సౌత్ పీసీ అభ్యర్థిపై 25.04.24న జయనగర్ పీఎస్ యూ/ఎస్ 123(3)లో కేసు బుక్ చేయబడింది" అని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.

కాంగ్రెస్‌కు చెందిన సౌమ్యారెడ్డిపై తేజస్వి పోటీ చేసే కీలకమైన సీటులో శుక్రవారం కర్ణాటకలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మతం పేరుతో ఓట్లు అడగటం సూర్య చేసిన నేరమని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా.. వారి మీద ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే పలు జాతీయ పార్టీల కీలక నేతలపై కూడా ఈసీకి పిర్యాదులు అందాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now