Lok Sabha Security Breach: వీడియో ఇదిగో, పసుపు రంగు గ్యాస్‌తో వచ్చిన దుండగుడిని పట్టుకున్న కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా, ఘటనపై ఆయన ఏమన్నారంటే..
వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది.
లోక్ సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. అతడి నుంచి నేను దానిని లాగి, బయటకు విసిరాను. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యం’ అని గుర్జీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొందరు ఎంపీలు బయటకు పరిగెత్తగా.. మరికొందరు ఆ దుండగుల వైపుగా వేగంగా వెళ్లి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన జరిగిన వెంటనే లోక్‌సభ కార్యకలాపాలు నిలిచిపోయి, సభ వాయిదా పడింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)