Loudspeaker Row: ముంబైలో ముదిరిన లౌడ్ స్పీకర్ల వివాదం, బాల్ థాకరే సంచలన వీడియోను విడుదల చేసి కలకలం రేపిన రాజ్ థాకరే

మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే సంచలన వీడియోను విడుదల చేసి కలకలం రేపారు. మసీదులపై లౌడ్ స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలంటూ ఆయన మహారాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు సర్కారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Raj Thackeray

మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే సంచలన వీడియోను విడుదల చేసి కలకలం రేపారు. మసీదులపై లౌడ్ స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలంటూ ఆయన మహారాష్ట్ర సర్కారుకు అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు సర్కారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అయినా సర్కారు నుంచి ఉలుకు పలుకు లేదు. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్లను వ్యతిరేకిస్తూ కొన్నేళ్ల క్రితం బాల్ థాకరే చేసిన ప్రసంగ వీడియో క్లిప్ ను రాజ్ థాకరే విడుదల చేశారు. తద్వారా బాల్ థాకరే కుమారుడు, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను ఇరకాటంలో పడేశారు.

36 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో బాల్ థాకరే ప్రసంగాన్ని వింటే.. లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా ఆయన హెచ్చరించడం వినిపిస్తుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లపై నమాజ్ చేయడాన్ని అడ్డుకుంటామని అందులో ఆయన పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్లపై రాజ్ థాకరే చేస్తున్న ఉద్యమానికి మహారాష్ట్ర సర్కారు నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదు. పైగా ఆయన చర్యను విమర్శిస్తూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. దీంతో శివసేన వ్యవస్థాపకుడి మార్గాన్ని సర్కారుకు రాజ్ థాకరే గుర్తు చేశారు. బాల్ థాకరే తమ్ముడి కుమారుడే రాజ్ థాకరే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement