LPG Price Cut: 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ.135 తగ్గింపు, మార్కెట్లో ఇప్పుడు 19 కేజీల సిలిండ‌ర్ రూ.2219కు లభ్యం

ప్ర‌భుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ఎల్పీజీ క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గించాయి. 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ.135 త‌గ్గించారు. జూన్ ఒక‌టో తేదీ నుంచి ఈ ధ‌ర అమ‌లులోకి రానున్న‌ది. మార్కెట్లో ఇప్పుడు 19 కేజీల సిలిండ‌ర్ రూ.2219కు ల‌భించ‌నున్న‌ది. నిన్న‌టి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ.2354గా ఉండేది.

Commercial LPG Cylinder Price Hiked by Rs 266 (Photo-Representative Image)

ప్ర‌భుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ఎల్పీజీ క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గించాయి. 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ.135 త‌గ్గించారు. జూన్ ఒక‌టో తేదీ నుంచి ఈ ధ‌ర అమ‌లులోకి రానున్న‌ది. మార్కెట్లో ఇప్పుడు 19 కేజీల సిలిండ‌ర్ రూ.2219కు ల‌భించ‌నున్న‌ది. నిన్న‌టి వ‌ర‌కు ఈ సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ.2354గా ఉండేది. మే 19వ తేదీన డొమెస్టిక్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను చివ‌రిసారి పెంచిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ ప్ర‌కటించిన కొత్త రేట్ల‌లో డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌ను మార్చ‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ కోల్‌క‌తాలో రూ.2322, ముంబైలో రూ.2171, చెన్నైలో రూ.2373కు ల‌భించ‌నున్న‌ది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను నెల‌లో రెండుసార్లు ప్ర‌క‌టిస్తారు. ఒక‌సారి నెల ఆరంభంలో, ఆ త‌ర్వాత నెల మ‌ధ్య‌లో కొత్త ధ‌ర‌ల‌ను వెల్ల‌డించే విష‌యం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now