Lucknow Building Collapse: 35 కుటుంబాలు శిధిలాల కిందనే, 7 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, లక్నోలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం

యూపీ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అరవై మంది దాకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. 7 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. భవనంలో 30-35 కుటుంబాలు నివసిస్తున్నాయని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు.

Lucknow Building Collapse (Photo-ANI)

యూపీ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అరవై మంది దాకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. 7 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. భవనంలో 30-35 కుటుంబాలు నివసిస్తున్నాయని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు.

ఇప్పటికే మూడు మృతదేహాలను వెలికి తీశారు సహయక బృందాలు. వజీర్ హసన్‌గంజ్ రోడ్‌లోని ఓ నివాస సముదాయం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే.. పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement