Maadhavi Latha VS JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి నన్ను కాపాడండి, సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత, వీడియో ఇదిగో..

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి... ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు

Madhavi Latha Vs JC Prabhakar Reddy (Photo-X/Video Grab)

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి... ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. జేసీ వ్యవహరించిన తీరుతో తన కుటుంబ సభ్యులు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

కాగా న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి తాడిపత్రిలోని జేసీ పార్క్ లో పట్టణంలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మహిళల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహిళలు హాజరుకావద్దని చెబుతూ మాధవీలత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. జేసీ పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయని... మహిళలు అక్కడకు వెళ్లవద్దని సూచింది. దీంతో, ఆమెపై జేసీ విరుచుకుపడ్డారు. మాధవీలతను ఒక ప్రాస్టిట్యూట్ అని సంబోధించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ లో మాధవీలత ఫిర్యాదు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now