Madhya Pradesh: చీరతో ఆడుకుంటూ పొరపాటున మెడకు తగిలించుకున్న బాలిక, ఊపిరి ఆడక మృతి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన
ఇంటి బయటి గోడకు వెదురుతో కట్టిన చీరను ఉపయోగించి ఆడుతుండగా ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుందని తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక ఉరివేసుకున్నట్లు గుర్తించి, ఆమెను కోత్మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు,
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఏడేళ్ల బాలిక చీరతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఉరివేసుకుని చనిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం పకారియా గ్రామంలో బాలిక తన తల్లి ఇంట్లో పని చేస్తుండగా బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని కోత్మా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ బైగా తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇంటి బయటి గోడకు వెదురుతో కట్టిన చీరను ఉపయోగించి ఆడుతుండగా ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుందని తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక ఉరివేసుకున్నట్లు గుర్తించి, ఆమెను కోత్మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారని అధికారి తెలిపారు.
Here's Update