Cheetah Jwala Gives Birth to Three Cubs: ఎంత అందంగా ఉన్నాయో చూశారా, మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చీతా, వీడియో ఇదిగో..
కునో నేషనల్ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా (Jwala) అనే చీతా.. మూడు పిల్లలకు (Cubs) జన్మనిచ్చింది. ఈ సందర్భాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు.
కునో నేషనల్ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా (Jwala) అనే చీతా.. మూడు పిల్లలకు (Cubs) జన్మనిచ్చింది. ఈ సందర్భాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు. కొత్తగా పుట్టిన చిరుత కూనలకు సంబంధించిన అందమైన వీడియోని కూడా షేర్ చేశారు. తల్లి పొత్తిళ్లలో అవి ఆడుకుంటూ కనిపించాయి. 20 రోజుల క్రితం (ఈ నెల 3న) నమీబియా నుంచే తీసుకొచ్చిన ఆశా (Aasha) అనే చిరుత మూడు కూనలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ఆషా చిరుత
2023 మార్చిలో జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కాగా, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. ఇక నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందాయి. వీటిలో 7 పెద్దవి, మూడు కూనలు ఉన్నాయి.
Here's Kid Cubs
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)