Patra Chawl Land Scam Case: శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఈడీ షాక్, వెయ్యి కోట్ల పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి రౌత్ రూ. 11 కోట్ల ఆస్తుల‌ను అటాచ్ చేసిన ఈడీ

ఆమె భార్య‌కు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్ల‌లో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన‌వి కాగా… 2 కోట్లు సంజ‌య్ రౌత్ భార్య‌కు సంబంధించిన‌వి.

After Maharashtra, BJP may lose Goa too in political earthquake: Shiv Sena MP Sanjay Raut (Photo-ANI)

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్య‌కు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది.  ఈ 11 కోట్ల‌లో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన‌వి కాగా… 2 కోట్లు సంజ‌య్ రౌత్ భార్య‌కు సంబంధించిన‌వి. వెయ్యి కోట్ల పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రౌత్‌కు సంబంధించిన అలీబాగ్ ప్లాట్‌, ముంబైలోని ఒక్కొక్క ఫ్లాట్‌ను అటాచ్ చేసింది.

ఇక ఈడీ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి కొన్ని గంట‌ల ముందే శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడికి లేఖ రాశారు. ఈడీతో స‌హా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్‌గా చేస్తున్నాయంటూ రౌత్ వెంక‌య్య‌నాయుడికి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్‌కు కూడా ఈడీ షాకిచ్చింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఆయ‌న ప‌రివారానికి సంబంధించి 4.81 కోట్ల‌ను అటాచ్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)