Maharashtra: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 ప్రకటించిన సీఎం ఏకనాథ్ షిండే

పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 త‌గ్గిస్తున్న‌ట్లు ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. కొత్త రేట్లు రేప‌టి నుంచి ముంబైలో అమ‌లుకానున్నాయి.

Eknath Shinde (Credits: Facebook)

మ‌హారాష్ట్ర స‌ర్కార్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 త‌గ్గిస్తున్న‌ట్లు ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. కొత్త రేట్లు రేప‌టి నుంచి ముంబైలో అమ‌లుకానున్నాయి. దీంతో ముంబైలో లీట‌రు పెట్రోల్ రూ.106కు ల‌భించ‌నున్న‌ది. ఇంధ‌నంపై వ్యాట్‌ను త‌గ్గిస్తున్నామ‌ని, దీని వ‌ల్ల రాష్ట్ర బ‌డ్జెట్‌పై 6000 కోట్ల భారం ప‌డ‌నున్న‌ట్లు సీఎం ఏక్‌నాథ్ తెలిపారు. కానీ దీని ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రించ‌వ‌చ్చు అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 1975 ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో జైలుకు వెళ్లిన వారికి మ‌హారాష్ట్ర స‌ర్కార్ పెన్ష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ తెలిపారు. ఈ నిర్ణ‌యాన్ని 2018లోనే తీసుకున్నామ‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వం దీన్ని అమ‌లు చేయ‌లేద‌న్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)