Bihar: ఘోర ప్రమాదం వీడియో, పోలీస్ సిబ్బంది బస్సు కింద దూరిన బైక్, ఒక్కసారిగా పేలుడు, ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనం, బీహార్‌లో విషాద ఘటన

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్‌ సిబ్బందితో వెళ్తున్న బస్సు బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో ఇంధన ట్యాంకర్‌ పేలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Man burnt alive as bus carrying police personnel rams into bikers in Bihar (Photo-Video grab)

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్‌ సిబ్బందితో వెళ్తున్న బస్సు బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో ఇంధన ట్యాంకర్‌ పేలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసు సిబ్బందితో చప్రా సివాన్‌ హైవేపై వెళుతున్న బస్సు డియోరియా గ్రామ సమీపంలోకి రాగానే బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో వారిలో ఒకరు బైక్‌తో సహా బస్సు కింద ఇరుక్కు పోయారు.

దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలి అగ్నికీలలు చుట్టుముట్టాయి.ఆ ముగ్గురు వ్యక్తుల బస్సు కిందకు రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కన్న బైకర్‌తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీస్‌ అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now