Madhya Pradesh: తోపుడు బండిపై 5 కిలోమీటర్లు తోసుకుంటూ వృద్ధుడిని ఆస్పత్రికి తరలింపు, వార్తను ప్రసారం చేసిన ముగ్గురు జర్నలిస్టులపై కేసు నమోదు చేసిన ఎంపీ పోలీసులు
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓ కుటుంబంలోని వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీటర్లు తోసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. ఈ ఘటనలో ముగ్గురు స్థానిక విలేకరులపై ఎంపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓ కుటుంబంలోని వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీటర్లు తోసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. ఈ ఘటనలో ముగ్గురు స్థానిక విలేకరులపై ఎంపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సామాజిక వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని, మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సదరు జర్నలిస్టులపై కేసు నమోదైంది. విలేకరుల తప్పుడు, నిరాధార వార్త రిపోర్ట్ చేశారని అభియోగం మోపారు.
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. సదరు కుటుంబం అంబులెన్స్ కోసం తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఇక బాధిత కుటుంబం వాదన మరోలా ఉంది. సదరు రోగి కొడుకు హరికృష్ణ, కూతురు పుష్ప మాట్లాడుతూ ఫోన్ కాల్ చేసినా అంబులెన్స్ రాలేదని చెప్పారు. దీంతో తోపుడు బండిపై ఐదు కిలోమీటర్ల వరకు తోసుకుంటూ ఆస్పత్రికు తీసుకెళ్లామన్నారు.