Jharkhand: తండ్రి అంటే ఇలా ఉండాలి, అత్తగారింట్లో వేధింపులకు గురవుతున్న కూతురును మేళతాళాలతో పుట్టింటికి తెచ్చుకున్న వీడియో ఇదిగో..
ఈ నెల 15న అత్తగారింట్లో వేధింపులకు గురవుతున్న కూతురును మేళతాళాలతో ఓ తండ్రి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోను ఆ తండ్రి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 15న అత్తగారింట్లో వేధింపులకు గురవుతున్న కూతురును మేళతాళాలతో ఓ తండ్రి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోను ఆ తండ్రి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.వైరల్ వీడియో వివరాల్లోకెళితే..రాంచి సిటీలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి 2022 ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాను సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయి. అంతేగాక సచిన్‌కు అంతకు ముందే మరో వివాహం అయినట్లు తెలిసింది. అయినప్పటికీ తల్లిదండ్రుల సూచనతో సాక్షి గుప్తా అతడితో కాపురం చేస్తున్నది. కానీ, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండటం సాధ్యం కాదని నిర్ణయించుకుంది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పింది.
సాక్షి గుప్తా నిర్ణయాన్ని ఆమె తండ్రి, ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మేళతాళాల నడుమ టపాసులు కాలుస్తూ ఆమెను పుట్టింటికి తీసుకొచ్చారు. కుమార్తెలు ఎంతో విలువైన వారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే పుట్టింటి వారు అండగా ఉండాలని, గౌరవంగా చూసుకోవాలని ప్రేమ్ గుప్తా సూచించారు. మరోవైపు సచిన్‌తో విడాకుల కోసం న్యాయస్థానంలో కేసు వేశారు.
Here's Father Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)