Punjab & Haryana High Court: కొద్ది రోజులు కలిసుంటే అది సహజీవనంగా పరిగణించలేం, ఒకరిపై ఒకరికి బాధ్యత కలిగి ఉండి మనస్ఫూర్తిగా జీవిస్తేనే సహజీవనమని తెలిపిన పంజాబ్, హర్యానా హైకోర్టు
కలసి ఉన్నంత కాలం ఒకరిపై ఒకరికి బాధ్యత కలిగి ఉండి, మనస్ఫూర్తిగా జీవిస్తే దాన్ని వివాహం వంటి సహజీవనంగా పరిగణించవచ్చని జస్టిస్ మనోజ్ బజాజ్ పేర్కొన్నారు.
కొద్ది రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని సహజీవనంగా పరిగణించలేమని పంజాబ్, హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. కలసి ఉన్నంత కాలం ఒకరిపై ఒకరికి బాధ్యత కలిగి ఉండి, మనస్ఫూర్తిగా జీవిస్తే దాన్ని వివాహం వంటి సహజీవనంగా పరిగణించవచ్చని జస్టిస్ మనోజ్ బజాజ్ పేర్కొన్నారు. యువతి కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హర్యానాలోని యమునానగర్ జిల్లాలో జీవిస్తున్న ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. అయితే వీరి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిపై నవంబర్‌లో విచారణ జరిపిన కోర్టు.. ఈ జంటకు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)