Haryana Singer Death Case: 10 నిద్రమాత్రలతో సింగర్ దారుణ హత్య, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు, ప్లాన్ ప్రకారమే సంగీతను హత్య చేశారని వెల్లడి
ఢిల్లీకి చెందిన సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వారు మృతురాలితో కలిసి పనిచేసే రవి, అనిల్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల హర్యాన్వీ సింగర్ దివ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఢిల్లీకి చెందిన సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వారు మృతురాలితో కలిసి పనిచేసే రవి, అనిల్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల హర్యాన్వీ సింగర్ దివ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 11న కనిపించకుండ పోయిన ఆమె 3 రోజుల తర్వాత రోహ్‌తక్ మెహమ్ సమీపంలో శవమై కనిపించిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె స్నేహితులు రవి, అనిల్‌ను శనివారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్లాన్ ప్రకారమే సంగీతను హత్య చేశారని, చంపాడానికి ముందు ఆమెకు 10 నిద్ర మాత్రలు ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. సంగీత హత్య ఘటనలో సూత్రధారి రవి అని విచారణలో వెల్లడైంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)