Moderna COVID-19 Vaccine: మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి, దేశంలో అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా గుర్తింపు

అమెరికా ఫార్మా కంపెనీ మోడార్నా అభివృద్ధి చేసిన కరోనా టీకాకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఏ) మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా గుర్తింపు పొందింది. ప్రపంచంలో కరోనాకు అభివృద్ధి చేసిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం.

Moderna Vaccine (Photo-PTI)

అమెరికా ఫార్మా కంపెనీ మోడార్నా అభివృద్ధి చేసిన కరోనా టీకాకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఏ) మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా గుర్తింపు పొందింది. ప్రపంచంలో కరోనాకు అభివృద్ధి చేసిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం. అత్యవసర వినియోగానికి మోడెర్నాకు అనుమతి ఇచ్చామని, అయితే, ఇవి ఆంక్షలతో కూడిన అనుమతులు మాత్రమేనని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. త్వరలోనే ఫైజర్‌కూ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలు అందుబాటులో ఉండగా, మోడెర్నా నాలుగోదని డాక్టర్ పాల్ పేర్కొన్నారు. పాలిచ్చే తల్లలు కూడా ఈ నాలుగు టీకాలు సురక్షితమైనవని చెప్పారు. కాగా, దేశంలో అత్యవసర వినియోగానికి మోడెర్నా టీకాలను దిగుమతి చేసుకునేందుకు ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ సిప్లాకు ఈ ఉదయం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement