Monkeypox in Delhi: దేశంలో మళ్లీ మంకీపాక్స్‌ అలజడి, ఢిల్లీలో మంకీపాక్స్‌ 8వ కేసు నమోదు, భారత్‌లో 13కు పెరిగిన కేసులు

ఢిల్లీలో మంకీపాక్స్‌ 8వ కేసు నమోదైంది. 30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నది. మంకీపాక్స్‌ సోకిన మరో నైజీరియా మహిళ కూడా ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

Representative Image( Pic Credit-ANI)

New Delhi, Sep 16: ఢిల్లీలో మంకీపాక్స్‌ 8వ కేసు నమోదైంది. 30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నది. మంకీపాక్స్‌ సోకిన మరో నైజీరియా మహిళ కూడా ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వ్యాధి లక్షణాలున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 8కి చేరిందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు దేశంలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 13కు పెరిగింది. ఇందులో 8 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. మరో ఐదు కేసులు కేరళలో వెలుగు చూశాయి.దేశంలో తొలి కేసు ఈ ఏడాది జూలై 14న కేరళలోని కొల్లాం జిల్లాలో నమోదైంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement