Mumbai Rains: ముంబై నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన భారీ వర్షం, హోర్డింగ్ కూలి ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన షిండే, వీడియోలు ఇవిగో..
మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షం కారణంగా 15 విమానాలను దారి మళ్లించారు.
ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షం కారణంగా 15 విమానాలను దారి మళ్లించారు. ఘాట్‌కోపర్‌లోని చెద్దానగర్ జంక్షన్‌లో వంద అడుగుల బిల్ బోర్డు కూలిపోయి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌పై పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 67 మంది వరకు గాయపడ్డారు.
బిల్ బోర్డు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. పాల్ఘర్, థానే జిల్లాల్లో రానున్న మూడునాలుగు గంటల్లో.. 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించింది. భారీ గాలులు, వర్షాల కారణంగా ఆరే – అంధేరీ ఈస్ట్ మెట్రోస్టేషన్ల మధ్య రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబైలోని పెట్రోలు పంపు పక్కన ఉన్న ఓ టవర్ హోర్డింగ్ కారణంగా మరణించిన వారి బంధువులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)