Covid in Mumbai: ముంబైలో మళ్ళీ పెరుగుతున్న కేసులు, వానా కాలం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో హై అలర్ట్, పాజిటివిటీ రేటు ఆరుకు చేరిన‌ట్లు తెలిపిన బీఎంసీ

ముంబైలో మ‌ళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. న‌గ‌రంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరిన‌ట్లు బీఎంసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీంతో టెస్టింగ్‌ను పెంచేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇక వానా కాలం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న కేసుల సంఖ్య పెరుగుతుంద‌ని బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తెలిపింది

COVID-19 in India (Photo Credits: PTI)

ముంబైలో మ‌ళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. న‌గ‌రంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరిన‌ట్లు బీఎంసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీంతో టెస్టింగ్‌ను పెంచేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇక వానా కాలం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న కేసుల సంఖ్య పెరుగుతుంద‌ని బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తెలిపింది. మంగ‌ళ‌వారం ముంబైలో కొత్త‌గా 506 కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి ఆర‌వ తేదీ నుంచి ఇదే అత్య‌ధిక సంఖ్య‌. ముంబైలో ఏప్రిల్ నెల‌తో పోలిస్తే మే నెల‌లో వంద శాతం కేసులు పెరిగిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement