Mumbai Road Accident: ఆటో రిక్షాలో మంటలు, మహిళ ప్రయాణికురాలు సజీవ దహనం, మహారాష్ట్రలోని థానేలో విషాదకర ఘటన

మహారాష్ట్రలోని థానేలో ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్‌బందర్‌ రోడ్డులోని గైముఖ్‌ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు.

Representative image (Photo Credit: Pixabay)

మహారాష్ట్రలోని థానేలో ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్‌బందర్‌ రోడ్డులోని గైముఖ్‌ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు.

ఆమె వాహనంలో ఇరుక్కుపోవడంతోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ఆ ఆటో రిక్షి థానే నగరం నుంచి భయందర్‌ వైపు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్‌ రాజేష్‌ కుమార్‌కు(45) తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Here's Update

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement