Covid in Mumbai: ముంబైలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, కోవిడ్ కేసుల్లో ఏకంగా 46శాతం పెరుగుదల కనిపించిందని తెలిపిన అధికారులు, కొత్తగా 739 కరోనా కేసులు నమోదు

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారానికి కరోనా కేసుల్లో ఏకంగా 46శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు

COVID-19 Vaccination (Photo Credits: ANI)

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారానికి కరోనా కేసుల్లో ఏకంగా 46శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు. అలాగే ముంబైలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 8.4 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ముంబైలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,970గా ఉంది. ఇలా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నగరంలో కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఆదేశాలిచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement