Murugha Mutt Seer Sex Scandal: మైనర్ బాలికలపై సన్యాసి లైంగిక దాడి, మఠాధిపతి శివమూర్తి మురుగపై లుక్అవుట్ నోటీసు జారీ చేసిన కర్నాటక పోలీసులు
కర్ణాటకలో మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ సన్యాసి, మఠాధిపతి శివమూర్తి మురుగపై పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. మఠం నిర్వహిస్తున్న విద్యా సంస్ధలో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై శివమూర్తి మురుగ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
కర్ణాటకలో మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ సన్యాసి, మఠాధిపతి శివమూర్తి మురుగపై పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. మఠం నిర్వహిస్తున్న విద్యా సంస్ధలో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై శివమూర్తి మురుగ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడు దేశం దాటి పోకుండా ముందు జాగ్రత్త చర్యగా లుక్అవుట్ నోటీస్, సర్క్యులర్ (ఎల్ఓసీ)ను కర్నాటక పోలీసులు జారీ చేశారు.
ఇద్దరు మైనర్ బాలికల తరపున అందిన ఫిర్యాదు ఆధారంగా శివమూర్తి మురుగపై మైసూర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్యాసి శివమూర్తి మురుగపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.శివమూర్తి మురుగను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శివమూర్తి మురుగ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)