Viral Video: వీడియో ఇదిగో, అద్దాలను పగులగొట్టుకుంటూ ఏటీఎంలోకి దూసుకొచ్చిన అడవిపంది, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ పెద్దాయన
ముక్కుడకు చెందిన గోపాలన్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేస్తుండగా అడవి పంది ఏటీఎం పెద్ద అద్దాలను పగులగొట్టి లోపలికి దూరింది. హఠాత్తుగా చొరబడటంతో దిగ్భ్రాంతికి గురైన గోపాలన్ ఏటీఎంలోంచి బయటకు పరుగులు తీశాడు
ఎరుమేలిలో సోమవారం ఉదయం అడవి పంది ఏటీఎంలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఎరుమేలి బస్టాండ్ సమీపంలోని ఎస్‌ఐబీ ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ముక్కుడకు చెందిన గోపాలన్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేస్తుండగా అడవి పంది ఏటీఎం పెద్ద అద్దాలను పగులగొట్టి లోపలికి దూరింది. హఠాత్తుగా చొరబడటంతో దిగ్భ్రాంతికి గురైన గోపాలన్ ఏటీఎంలోంచి బయటకు పరుగులు తీశాడు.అదృష్టవశాత్తూ కూలిన గ్లాస్ డోర్ గోపాలన్ తలపై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అద్దం పగిలిపోవడంతో కాలికి గాయాలయ్యాయి. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.
వీడియో ఇదిగో, పుల్లుగా తాగి రీల్ కోసం రైలు పట్టాలపై ఎస్‌యూవీని నడిపిన మందుబాబు, చివరకు ఏమైందంటే..
wild boar crashes into ATM
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)