Navale Bridge Accident: పూణేలో ఘోర ప్రమాదం, 48 వాహనాలను ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్, దాదాపు 38 మందికి తీవ్ర గాయాలు, ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
మహారాష్ట్రలోని పుణెలో గల పుణె-బెంగళూరు రహదారిపై నవ్‌లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. లారీ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని పుణెలో గల పుణె-బెంగళూరు రహదారిపై నవ్‌లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. లారీ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.ఆ సమయంలో లారీలోని ఆయిల్ రోడ్డుపై పడటంతో పలు వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
ఈ ఘటనలో దాదాపు 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పుణె ఫైర్ బ్రిగేడ్, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)