NIA Reward on Dawood Ibrahim: దావూద్ ఇబ్ర‌హీం ఆచూకి చెబితే రూ. 25 లక్షల రివార్డు, చోటా ష‌కీల్‌పై సమాచారం ఇస్తే 20 ల‌క్ష‌ల న‌జ‌రానా, రివార్డులను ప్రకటించిన ఎన్ఐఏ

గ్యాంగ్‌స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకి చెప్పిన వారికి 25 ల‌క్ష‌ల రివార్డును ఎన్ఐఏ ప్ర‌క‌టించింది.అతని గురించి ఎవరైనా సమాచారం షేర్ చేసుకుంటే ఈ రివార్డు వారికి అందిస్తామని తెలిపింది. 1993లో ముంబైలో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల కేసులో అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం కీల‌క నిందితుడిగా ఉన్నాడు.

National Investigative Agency (Photo Credits: Wikimedia Commons)

గ్యాంగ్‌స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకి చెప్పిన వారికి 25 ల‌క్ష‌ల రివార్డును ఎన్ఐఏ ప్ర‌క‌టించింది.అతని గురించి ఎవరైనా సమాచారం షేర్ చేసుకుంటే ఈ రివార్డు వారికి అందిస్తామని తెలిపింది. 1993లో ముంబైలో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల కేసులో అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం కీల‌క నిందితుడిగా ఉన్నాడు. ఇక దావూద్ స‌న్నిహితుడు ష‌కీల్ షేక్ అలియాస్ చోటా ష‌కీల్ పై కూడా 20 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది ఎన్ఐఏ.

దావూద్‌కు ప‌నిచేసిన హ‌జి అనీస్ అలియాస్ అనీస్ ఇబ్ర‌హీం షేక్‌, జావెద్ ప‌టేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్ర‌హీం ముస్తాక్ అబ్దుల్ ర‌జాక్ మీమ‌న్ అలియాస్ టైగ‌ర్ మీమ‌న్ స‌మాచారం ఇస్తే 15 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు జాతీయ ద‌ర్య‌ప్తు సంస్థ వెల్ల‌డించింది. ఈ నిందితులంద‌రూ 1993 ముంబై సీరియ‌ల్ పేలుళ్ల కేసులో వాంటెడ్ లిస్టులో ఉన్నారు. కాగా ఫిబ్ర‌వ‌రిలో డీ కంపెనీపై ద‌ర్యాప్తు సంస్థ కేసును న‌మోదు చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now