Nihang Sikhs Clash: పోలీసులపై నిహాంగ్ సిక్కులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి, గురుద్వారా యాజమాన్యం విషయంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ
సుల్తాన్‌పూర్ లోధి పోలీసులకు, నిహాంగ్ సిక్కుల బృందానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, మరో ముగ్గురు పోలీసులు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
సుల్తాన్‌పూర్ లోధి పోలీసులకు, నిహాంగ్ సిక్కుల బృందానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, మరో ముగ్గురు పోలీసులు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పబ్జాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని సుల్తాన్‌పూర్ లోధి వద్ద గురుద్వారా యాజమాన్యం విషయంపై నిహాంగ్‌ల రెండు సమూహాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఫలితంగా కాల్పులు జరిగాయి. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
బాబా బుద్ధ దళ్ అధినేత, బాబా బల్వీర్ సింగ్ గురుద్వారా ముందు భాగాన్ని ఆక్రమించాడని, అక్కడ అతని ఇద్దరు సహాయకులు నిర్వైర్ సింగ్ మరియు జగ్జీత్ సింగ్ కూర్చున్నట్లు ముందుగా ఒక పత్రికా ప్రకటన తెలిపింది. ఈ క్రమంలో ఒక వర్గం వారు గురుద్వారాలోకి ప్రవేశించి దానికి తాళం వేయబోయారు. దానిని అడ్డుకోవడానికి మరో వర్గం వారు ప్రయత్నించడంతో అక్కడ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ నెలకొన్నది.
ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. సుమారు 30 మంది నిహాంగ్‌లు గురుద్వారాలోనే ఉన్నారని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు సిబ్బందిని మోహరించారు.
Here's ANI Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)