Telangana: షాకింగ్... రైలు పట్టాలపై బైకుతో ప్రయాణం..ట్రైన్‌ను ఆపేసిన అధికారులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రైల్వే పట్టాలపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట వద్ద షిరిడీ నుంచి తిరుపతి వెళుతున్న రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్యలో ద్విచక్రవాహనంపై రైలుకి ఎదురెళ్లాడు జగదీష్ అనే వ్యక్తి. జగదీష్‌ను పట్టాలపై నుంచి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

Nizamabad Shocking Incident, A young man rides a two-wheeler on the railway tracks(video grab)

రైల్వే పట్టాలపై ద్విచక్ర వాహనంతో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట వద్ద షిరిడీ నుంచి తిరుపతి వెళుతున్న రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్యలో ద్విచక్రవాహనంపై రైలుకి ఎదురెళ్లాడు జగదీష్ అనే వ్యక్తి. జగదీష్‌ను పట్టాలపై నుంచి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

గేట్ మెన్ స్పందించి పైలెట్లకు సమాచారం ఇవ్వడంతో పోచమ్మకట్ట సమీపంలో రైలు నిలిపివేయగా జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు సీఆర్పీఎఫ్ పోలీసులు. తన భార్యతో సఖ్యత లేకపోవడం వల్ల ఆత్మహత్యకు యత్నించానని జగదీష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  హైదరాబాద్‌లో మరో రాష్ డ్రైవింగ్ కేసు..మల్లేపల్లిలో హోండా సిటీ కారు బీభత్సం, వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిన వైనం..పలువురికి గాయాలు...వీడియో ఇదిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now